కౌంటింగ్ కొరకు సిద్ధంగా ఉండండి: ప్రభుత్వ విప్

కౌంటింగ్ కొరకు సిద్ధంగా ఉండండి: ప్రభుత్వ విప్ రైల్వేకోడూరు మన జనప్రగతి ఏప్రిల్ 18:- ఎన్నికల కౌంటింగ్ కొరకు ఎంపీటీసీ, జడ్పిటిసి అభ్యర్థులు తమ ఏజెంట్లతో సిద్ధంగా ఉండాలని రైల్వేకోడూరు శాసన సభ్యులు మరియు ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. కడప జిల్లా రైల్వే కోడూరు లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొరముట్ల మాట్లాడుతూ రేపు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నందు జడ్పిటిసి, ఎంపిటిసి లకు సంబంధించి తీర్పు వెలువడే అవకాశం ఉన్నందున ఎన్నికల కౌంటింగ్ కొరకు ఏజెంట్లను సిద్ధం చేసుకోవాలని ఆయన అన్నారు. కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అని ప్రతి ఒక్కరూ ఆసక్తికరంగా ఉన్నారని ఆయన అన్నారు.