సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోవద్దు: జిల్లా ఎస్
సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోవద్దు: జిల్లా ఎస్పీ
కడప మన జనప్రగతి ఏప్రిల్ 18:-
సోషల్ మీడియా లో వచ్చే మెసేజ్ ల ద్వారా ఫేక్ ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్స్ బారిన పడి మోసపోవద్దని కడప జిల్లా ఎస్పీ అన్బు రాజన్ తెలిపారు. ఇటీవలి కాలంలో వాట్సాప్ లో 'పింక్ లింక్' పేరిట వచ్చే మోసపూరిత లింకులను క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల బారిన పడవద్దని ప్రజలకు సూచించారు.
ఆన్ లైన్ షాపింగ్, వెబ్ సైట్ల ఆఫర్ అంటూ వాట్సాప్ లో వచ్చే లింకులను క్లిక్ చేస్తే మన వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతుందని, మీకు తెలియకుండానే మీరు సభ్యులుగా ఉన్న గ్రూపులన్నింటికీ క్షణాల్లో వెళ్ళిపోతుందని, దానిని చూసి మిగతా వాట్సాప్ గ్రూప్ సభ్యులు కూడా క్లిక్ చేస్తే వారు కూడా మోసపోయే అవకాశం ఉందన్నారు. కావున ప్రజలు ఇటువంటి సైబర్ నేరగాళ్ళ మాయ మాటలకు లోబడకుండా అప్రమత్తం గా ఉండాలని, అటువంటి నేరగాళ్ళు మీకు ఫోన్ చేసిన వెంటనే మీకు దగ్గరలో గల పోలీసు స్టేషన్ లో గాని, లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని పిర్యాదు చేయాలని తెలిపారు.