గంగమ్మ తల్లి బోనాల పండుగలో ఆకేపాటి

గంగమ్మ తల్లి బోనాల పండుగలో ఆకేపాటి రాజంపేట మన జనప్రగతి ఏప్రిల్ 18:- గంగమ్మ తల్లికి జరిపిన బోనాల పండగ మహోత్సవంలో రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజంపేట మాజీ శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి పాల్గొన్నారు. కడప జిల్లా రాజంపేట మండల పరిధిలోని తాళ్ళపాక గ్రామం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ రాజంపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ యోగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి బోనాల పండుగ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున భక్తులు బోనాలతో తరలివచ్చి గంగమ్మ తల్లికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గౌరీశంకర్, ఎంపీటీసీ మధు పోలి మురళీ మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి, దాసరి పెంచలయ్య, డెంటల్ డాక్టర్ మధు తదితరులు పాల్గొన్నారు.