మాస్కులు లేకుండా తిరిగితే జరిమానా తప్పద

మాస్కులు లేకుండా తిరిగితే జరిమానా తప్పదు
రైల్వేకోడూరు మన జనప్రగతి ఏప్రిల్ 18:- బయట తిరిగేటప్పుడు మాస్కులు ధరించని వారికి జరిమానా తప్పదని రైల్వేకోడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆనంద్ రావు తెలిపారు. రైల్వే కోడూరు కేంద్రంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇంటి నుండి బయటకు వచ్చిన సమయంలో ప్రతి ఒక్కరు మాస్కు ధరించి భౌతిక దూరం పాటిస్తూ తరచుగా చేతులను శానిటైజర్ తో శుభ్రపరచుకోవాలని ఆయన హితవు పలికారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరమని ఆయన అన్నారు. ఆటోలు, బస్సులు, జీపు, వ్యాను లలో ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ హితవు పలికారు. ఆటో, జీపు డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణీకులను తరలించవద్దని, ప్రయాణీకులను తరలించే సమయంలో మాస్కు తప్పనిసరిగా ధరించేలా ప్రయాణికులకు అవగాహన కల్పించాలని ఇన్స్పెక్టర్ ఆనందరావు తెలిపారు.