సిసి రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పరిశీలించిన చైర్మన్

సిసి రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పరిశీలించిన చైర్మన్
పులివెందుల టౌన్ మన జనప్రగతి ఏప్రిల్ 18:- వార్డు పర్యటనలో భాగంగా ఆదివారం మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర రెడ్డి, మునిసిపల్ చైర్మన్ వి వరప్రసాద్, మునిసిపల్ కమిషనర్ వి వి నరసింహా రెడ్డి తోకలసి స్థానిక బాకరాపురం నందు పర్యటించి అక్కడ జరుగుతున్న సిసి రోడ్లు మరియు భూగర్భ డ్రైనేజి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా కాంట్రాక్టర్లు సిసి రోడ్లు వేసేటప్పుడు జాఇంట్ల వద్ద ఖచ్చితంగా లెవెల్స్ చూడాలన్నారు. యు జిడి ఛాంబర్లు మరియు మ్యాన్ హోల్స్ క్యూరింగ్ తప్పనిసరిగా చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మురళీధర్ పాల్గొన్నారు.