ఎలుగుబంటి దాడి ముగ్గురు భక్తులకు గాయాలు

 


పెండ్లిమర్రి మన జనప్రగతి మే 04:-  
మండలం పోలతల పుణ్యక్షేత్రంలో భక్తుల పై ఎలుగుబంటి దాడి ముగ్గురికి గాయాలు. పొలతల పుణ్యక్షేత్రానికి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు అందులో భాగంగా మంగళవారం పొలతల కు వెళ్ళిన భక్తులు పై ఎలుగుబంటి దాడి చేయడం జరిగింది
ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యమే భక్తుల పై దాడులు అంటున్న స్థానికులు.గతంలో కూడా ఇలాగే దాడులు జరిగినట్లు సమాచారం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇలా జరగకుండా చర్యలు చేపట్టాలని భక్తులు పేర్కొంటున్నారు