కరోనా జాగ్రత్తలు పాటించాలి: మున్సిపల్ ఛైర్మన్

 


బద్వేల్ మన జనప్రగతి మే 04:-

మధ్యాహ్నం 12 గంటల నుండి సంపూర్ణమైన లాక్ డాన్ ను విధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బద్వేల్ పట్టణంలోని ప్రజలు, వ్యాపారస్తులు తప్పనిసరిగా కరోనా జాగ్రత్తలు పాటించాలని మున్సిపల్ ఛైర్మన్ వాకమళ్ళ రాజగోపాల్ రెడ్డి సూచించారు.మున్సిపల్ కమిషనర్, సిబ్బందితో కలిసి పట్టణ పురవీధుల్లో ఛైర్మన్ రాజగోపాల్ రెడ్డి మంగళవారం పర్యటించారు. కరోనా నిబంధనలు భౌతిక దూరం పాటిస్తూ నిత్యావసర సరుకుల వద్ద, చికెన్ అంగడి వద్ద, కూరగాయల మార్కెట్ వద్ద, జనం గుమికూడవద్దని, గుంపులు గుంపులుగా ఉండవద్దని తెలియజేశారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్దనుండి పూలే విగ్రహం వరకు నడుచుకుంటూ ప్రజలకు కరోనా జాగ్రత్తలు తెలియజేశారు. మున్సిపల్ ఛైర్మన్ రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కృష్ణా రెడ్డి, కన్సిలర్ వెంకటేశ్వర్లు, మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.