కరోనాతో కార్పొరేటర్ బోలా పద్మావతి మృతి
కడప మన జనప్రగతి మే 04:-
కరోనా తో పోరాడి కడప కార్పొరేటర్ మృతి చెందారు. కడప 22 వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ కార్పొరేటర్, సీనియర్ మహిళా నాయకురాలు బోలా పద్మావతి కరోనాతో పోరాడుతూ కడప రిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం మృతి చెందారు. గతంలో కడప మునిసిపాలిటీ వైస్ చైర్మన్ తో పాటు, ఇంచార్జ్ చైర్ పర్సన్ గా బోలా పద్మావతి పని చేశారు. పట్టణ ప్రజలకు ఎంతో సేవ చేస్తూ వస్తున్నారు జిల్లాలో అనేక పదవులు అనుభవించి మంచి మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఉంటూ ఆప్యాయంగా పలకరిస్తూ అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం గల మహిళగా గుర్తింపు పొందారు