నిర్ణీత సమయంలోనే దుకాణాలు తెరవాలి: సీఐ

 


కమలాపురం మన జనప్రగతి మట్ 04:-

ప్రభుత్వం నిర్ణయించిన సమయాల్లోనే దుకాణాలు తెరవాలని సీఐ ఉలసయ్య అన్నారు. మంగళవారం ఆయన కమలాపురం పట్టణంలోని పోలీస్ స్టేషన్ నగర పరిధిలోని హోటల్స్, దుకాణాల యాజమాన్యాలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు అవకాశముందన్నారు. ఎవరైనా నిబంధనల మేరకు ప్రవర్తించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరు నడుచుకోవాలని అలా కాకుండా ఇష్టానుసారంగా రోడ్లపైకి వస్తే తప్పకుండా వారి పైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్సై నాగ తులసి ప్రసాద్, దుకాణాల యజమానులు తదితరులు పాల్గొన్నారు.