'కరోనా మరణాలు ప్రభుత్వ హత్యలే'

 



బద్వేలు మన జనప్రగతి మే 04:-

కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల కరోనా సెకండ్ వెవ్ లో మరణాలు అధికమయ్యాయని కరోనాతో మరణించిన కుటుంబాలకు 20 లక్షల ఆర్థిక సహాయం అందించి వారిని ఆదుకోవాలని అంబేద్కర్ ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షుడు పి. వెంకటరమణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బద్వేలు పట్టణ దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పి వెంకట రమణ మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ రోజు దేశంలో కరోనా మరణాలు విలయ తాండవం చేస్తున్నాయని అన్నారు. దీని వల్ల దేశంలో ఆర్థిక వ్యవస్థ పతనం తోపాటు, మత మూఢ విశ్వాసాలతో జనాలకు తీవ్రమైన నష్టాన్ని కలిగించే విధంగా ప్రవర్తించిందని, చప్పట్ల వల్ల, దీపాలు వెలిగించడం వల్ల కరోనా పోదని, దానికి సరైన వైద్యం అందిస్తేనే కరోనాను కట్టడి చేయవచ్చని అన్నారు.

గుళ్లకు చూపిస్తున్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై చూపించి ఉంటే ఈరోజు ఈ స్థితి కలిగేది కాదని అన్నారు. ఇప్పటికైనా కరోనాతో ఇబ్బంది పడుతున్న వారికి సరైన వైద్య సహాయం అందించి వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం 10000 అందించాలని ఆయన డిమాండ్ చేశాడు.