ప్రజా సమస్యల పరిష్కారంకై సిపిఐ మౌనదీక్షలు

కడప మన జనప్రగతి మే 04:-

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో కష్టాలెదుర్కోంటున్న ప్రజల సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జి. ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా కడప జిల్లా కార్యాలయ ఎద్దుల ఈశ్వర్ రెడ్డి హాలులో సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య దీక్షలో కూర్చున్నారు.నేడు కరోనా విపత్తు కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులు, చిరువ్యాపారులు, చిన్నతరహా పరిశ్రమలు, పేదల స్థితిగతులను ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం 50 మంది బడాబాబులు తీసుకున్న 69వేల కోట్ల రూపాయలను ఒక్క కలం పోటుతో రద్దుచేసి పేదల, రైతుల కార్మికుల వెతలు పట్టించుకోక పోవడం దుర్మార్గపు చర్యలని వారు విమర్శించారు.

లాక్ డౌన్ వలన ముఖ్యంగా వలస కూలీలు ఎక్కడి వారక్కడే ఉండి పోవాల్సిన పరిస్తితి వచ్చింది. వారు వారి కుటుంబాల గురించి తీవ్ర వేదన అనుభవించారు. వలస కూలీలను స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో వారందరినీ సొంత ఊళ్లకు రప్పించాలి. ప్రతి పేదవానికి 50 కేజీల బియ్యం, 30కేజీల గోధుమలు ఇవ్వాలన్నారు. దీనితో పాటు కేంద్రం రూ. 5, 000, రాష్ట్ర ప్రభుత్వం రూ 5,000 చొప్పున మొత్తం రూ 10, 000 ఆర్ధిక సహాయం ఇవ్వాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ పనులు కల్పించాలి. పింఛను దారులకు పూర్తి పింఛను చెల్లించాలన్నారు.